మొట్టమొదటి సారిగా మహేష్ జంట..పోస్టర్ వైరల్.!

Published on Oct 1, 2021 7:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు తన భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మరోపక్క తన ఇతర వ్యవహారాలు సామాజిక సేవ వంటి అంశాలను మహేష్ భార్య నమ్రత చాలా చక్కగా కూడా చూసుకుంటారు. అందుకే వీరి జంట అంటే అభిమానుల్లో ఒకరకమైన అభిమానం ఉంటుంది.

అయితే వీరిద్దరిదీ ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. వంశీ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ తర్వాత వివాహంతో ఒకటయ్యారు. మరి ఇదిలా ఉండగా మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కూడా కెమెరా ముందుకు రావడం ఆసక్తిగా మారింది. ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ నిమిత్తం మహేష్ మరియు నమ్రతలు కలిసి స్టైలిష్ డ్రెస్సింగ్ లో అదరగొట్టారు.

అంతేకాకుండా వీరిద్దరికీ కలిపి మొట్ట మొదటి ఫోటో షూట్ కూడా ఇదే అట. దీనితో ఇపుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవ్వడం మొదలయ్యింది. మరి ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” షూట్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :