భరత్ మనసు భారత్ పైకి మళ్లేదెప్పుడు…?

Published on Jun 15, 2019 9:52 am IST

మహేష్ కుటుంబ సమేతంగా ఇండియా వదిలివెళ్ళి దాదాపు మూడు వారాలుకావస్తుంది. ఆయన ఇప్పటివరకు జర్మనీ,ఇటలీ యాత్రలు ముగించుకొని ప్రస్తుతం లండన్ లో సెటిలైయ్యారు. తను వెళుతున్న ప్రదేశాలు, చేస్తున్న అక్టీవిటీస్ గురించి ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ను మహేష్ తో కలిసి వీక్షించడానికి లండన్ వెళ్లిన “మహర్షి” దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మహేష్ తో లండన్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఐతే మహేష్ మళ్ళీ భారత్ లో ఎప్పుడు అడుగుపెడతారో ఇంకాస్పష్టత రాలేదు.

మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయనున్న “సరిలేరు నీకెవ్వరు” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26నుండి జరగనుందని సమాచారం. మరి ఆ తేదీ కూడా దగ్గరపడుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆయన రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు దాయాదుల మధ్య యుద్ధంలా భావించే ఇండియా,పాకిస్తాన్ కి మధ్య క్రికెట్ పోరు ఉన్న నేపథ్యంలో మహేష్ ఆ మ్యాచ్ ని కూడా తిలకించి గ్రాండ్ గా తన వరల్డ్ టూర్ ముగించుకొని ఇండియాకి తిరుగుపయనం అవుతారేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

X
More