టాలీవుడ్ నంబర్ వన్ మహేషే.. ఇదే ప్రూఫ్..

టాలీవుడ్ నంబర్ వన్ మహేషే.. ఇదే ప్రూఫ్..

Published on Apr 24, 2020 1:00 AM IST

స్టార్ హీరోలలో ఎవరు ఫస్ట్ అనే లెక్కలు ఎప్పుడూ ఫ్యాన్స్ కి కిక్కిస్తాయి. కానీ ఎవరి ఫ్యాన్స్ కి ఆ హీరో గొప్ప. తమ హీరో నంబర్ వన్ అని కాలర్ ఎగరేస్తూ ఉంటారు. ఐతే ఓ హీరోకి దక్కిన విజయాలు.. కలెక్షన్స్ లెక్కల ఆధారంగా ఈ ప్లేస్ లు, పోసిషన్ లు నిర్ణయిస్తారు. ఐతే బాలీవుడ్ కి చెందిన ఓ మీడియా సంస్థ అక్కడ హీరోల స్టార్ డమ్ ఫాలోయింగ్ లెక్కలు కట్టి ప్లేస్ లు నిర్ణయిస్తుంది. ఒర్మాక్స్ మీడియా అనే ఈ సంస్థ ఈ మధ్య టాలీవుడ్ మరియు కోలీవుడ్ పరిశ్రమలలో కూడా ఈ ట్రాకింగ్ మొదలుపెట్టింది.

వారి సర్వే మరియు ట్రాకింగ్ ప్రకారం టాలీవుడ్ లో కూడా హీరోలకు రేటింగ్ ఇచ్చారు. దాని ప్రకారం టాలీవుడ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ అట. మిగతా స్టార్ హీరోలందరితో పోల్చుకుంటే మహేష్ అత్యధిక పాయింట్స్ సాధించి ఫస్ట్ ప్లేస్ సాధించారట. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఆయన తరువాత స్థానాలు ఆక్రమించారు. ఒర్మాక్స్ ఈ మార్చి వరకు ప్రమాణికంగా తీసుకొని చేసిన సర్వేలో మహేష్ మొదటి స్థానం ఆక్రమించగా, బన్నీ రెండు, ప్రభాస్ మూడు, పవన్ నాలుగు మరియు ఎన్టీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఐదుగురు హీరోలు టాప్ ఫైవ్ లో నిలిచారు. చిరు, చరణ్ లకు టాప్ ఫైవ్ లో చోటు దక్కలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు