పూరి విమర్శించినా,మహేష్ ప్రశంసించారు?

Published on Aug 6, 2019 9:34 am IST

రామ్ పోతినేని,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” వారిద్దరికి అరుదైన విజయం అందించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శకుడు పూరికి,హీరో రామ్ కి భారీ ఉపశమనం కలిగించింది ఈ చిత్రం. ఇప్పటివరకు “ఇస్మార్ట్ శంకర్” వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లో 75కోట్ల మార్కును దాటివేసిందని సమాచారం.

కాగా ఆసక్తికరంగా మహేష్ ఇస్మార్ట్ శంకర్ మూవీని చిత్రం బృందంతో కలిసి చూశారని సమాచారం. ఈ మూవీ మహేష్ ని అమితంగా ఆకట్టుకోవడంతో దర్శకుడు పూరి, హీరో రామ్ అలాగే చిత్రంలో హీరోయిన్స్ గా నటించిన నిధి అగర్వాల్,నభా నటేష్ లపై ప్రశంసలు కురిపించారట. ఐతే కొద్దిరోజుల క్రితం పూరి “మహేష్ నేను విజయాలలో ఉన్నప్పుడు తప్పా, ప్లాప్స్ లో ఉన్నప్పుడు పట్టించుకోరు” అని, కొంచెం ఘాటు విమర్శలే చేశారు. మహేష్ అవేమి పట్టించుకోకుండా ఇస్మార్ట్ శంకర్ టీం పై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం :