మెగాస్టార్ కోసం సూపర్ స్టార్ ప్రొడ్యూసర్.?

Published on Sep 22, 2020 10:12 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్ళు పూర్తయ్యింది. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇపుడు షూటింగ్ దశలో ఉంది.

అయితే ఈ చిత్రం తర్వాత చిరు రెండు రీమేక్స్ ఒప్పుకున్నా సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో తమిళ్ చిత్రం వేదాళం రీమేక్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనుండగా ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ నిర్మాత టేకప్ చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

సూపర్ స్టార్ మహేష్ కు మరియు చిరుకు ఎలాంటి బాండింగ్ ఉందో “సరిలేరు నీకెవ్వరు” ప్రీ రిలీజ్ వేడుక చూస్తేనే చాలా మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇపుడు ఆ సినిమాకు నిర్మాతగా చేసిన అనీల్ సుంకరే ఈ మెగా ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయనున్నట్టుగా టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More