మరోసారి దమ్ము చూపించిన సూపర్ స్టార్ మహేష్.!

Published on Oct 23, 2020 7:04 am IST

రికార్డులు ఎలాంటివి అయినా ఎక్కడైనా సరే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మహేష్ నటించిన సినిమా వచ్చే ఏ ప్లాట్ ఫామ్ అయినా సరే భారీ రికార్డులు అతని పేరిట కొత్తగా ఎప్పుడూ నమోదు అవుతూనే ఉంటాయి.

అలా లేటెస్ట్ గా మహేష్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో దద్దరిల్లిందో అదే విధంగా తెలుగు స్మాల్ స్క్రీన్ పై కూడా అంతే స్థాయిలో భారీ టీఆర్పి రికార్డులను నెలకొల్పింది.

మొదటి రెండు సార్లు కూడా సాలిడ్ రేటింగ్ ను అందుకున్న ఈ చిత్రం మూడో సారి టెలికాస్ట్ లో కూడా అంతే స్ట్రాంగ్ గా నిలవడం విశేషం.గత వారం జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ చేయబడిన ఈ చిత్రానికి 12.55 టీఆర్పి రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా మూడోసారి టెలికాస్ట్ లో ఇది కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పి నే అని ఇండస్ర్టీ వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి మాత్రం సూపర్ స్టార్ మహేష్ తన దమ్మేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురాం తో “సర్కారు వారి పాట” అనే మరో మాస్ ఫ్లిక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More