అనిల్ రావిపూడి తో సినిమా గురించి స్పందించిన మహేష్ !

Published on May 5, 2019 9:06 am IST

మహర్షి తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాతి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయనున్నాడని తెలిసిందే. ఇక ఈ చిత్రం గురించి మహేష్, మహర్షి ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో స్పందించాడు. మాస్ రోల్ కోసం ఎదురుచూస్తున్న నాకు అనిల్ రావిపూడి సరిగ్గా అలాంటి కథే చెప్పాడు. వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమాకు ఓకే చెప్పాను. దూకుడు తరువాత మళ్ళీ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాను అని అన్నారు. జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది.

ఇక మహేష్ నటించిన 25వ చిత్రం మహర్షి ఈనెల 9న విడుదలకానుంది. ఈ సినిమా పట్ల మాహేష్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More