అన్ స్టాప్పబుల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న మహేష్ సాంగ్.!

Published on Mar 12, 2022 10:10 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. మరి ఈ సినిమాకి గాను సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఆల్రెడీ హిట్ అని అందరికీ తెలిసిందే.

మరి తాను ఇచ్చిన మోస్ట్ అవైటెడ్ సాంగ్ “కళావతి” అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మొదటి రోజు నుంచే సెన్సేషనల్ రెస్పాన్స్ ని ఈ సాంగ్ కొల్లగొట్టింది. మరి ఇదిలా ఉండగా ఈ సాంగ్ ఇప్పటికీ మరింత సర్ప్రైజింగ్ గా అన్ స్టాప్పబుల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

లేటెస్ట్ గా ఈ సాంగ్ ఏకంగా 80 మిలియన్ వ్యూస్ ని అందుకొని టాలీవుడ్ లో మరో ఫాస్టెస్ట్ వ్యూస్ అందుకున్న సాంగ్ గా రికార్డు రెస్పాన్స్ అని అందుకుంది. మొత్తానికి అయితే కళావతి సాంగ్ మరికొన్ని రోజుల్లోనే డెఫినెట్ గా 100 మిలియన్ మార్క్ ని కూడా క్రాస్ చేసేస్తోంది అని చెప్పాలి. ఈ లోపు సినిమా నుంచి రెండో సాంగ్ కి సంబంధించి కూడా కీలక అప్డేట్స్ ని మేకర్స్ అందివ్వనున్నారు.

సంబంధిత సమాచారం :