మహేశ్ బ్లాస్టర్ లీక్ వారి పనేనా?

Published on Aug 10, 2021 3:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా నేడు “సర్కారు వారి పాట” నుంచి బర్త్ డే బ్లాస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

ఆగష్టు 9 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు బ్లాస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ తొలుత టైమ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అనుకున్న సమయం కన్నా దాదాపు తొమ్మిది గంటలు ముందుగానే అర్ధరాత్రి టీజర్ ఆన్‌లైన్‌లో దర్శనం ఇవ్వడం, విడుదల సమయం కంటే ముందే అభిమానులందరికి చేరుతుండడంతో చిత్ర యూనిట్ ఖంగుతుంది. ఇక చేసేదేమి లేక టీజర్‌ను నిన్న నైట్ 12:30 గంటలకు అఫిషియల్‌గా విడుదల చేశారు.

అయితే టీజర్ ఇలా ముందుగానే లీక్ అవ్వడంపై చిత్ర యూనిట్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పని ఇంటి దొంగలే చేసి ఉంటారని అనుమానిస్తూ, ఆ పని చేసింది ఎవరో కనిపెట్టే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారట. అంతేకాకుండా దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూదా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ భారీ బ్లాస్టర్ లీక్ ఇంటి దొంగల పనేనో? లేకా మరెవరైనా చేశారో? చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :