ఆ స్థానం ఎన్టీఆర్, చరణ్ లకే అంటున్న మహేష్..!

Published on Feb 19, 2020 6:59 am IST

టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య చక్కని వాతావరణం ఉంది. టాప్ హీరోలుగా ఉన్న మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ వంటి వారి మధ్య సత్సంబంధాలు వున్నాయి. ఇక మహేష్, చరణ్ మరియు ఎన్టీఆర్ మంచి మిత్రులుగా ఉన్నారు. వీరు ముగ్గురు అప్పుడప్పుడు తమ కుటుంబాలతో కలిసి ప్రైవేట్ పార్టీలలో పాల్గొంటారు. వీరి మధ్య గల అనుబంధాన్ని మహేష్ మరో మారు తెలియజేశారు.

తాజా ఇంటర్వ్యూలో మహేష్ ని టాలీవుడ్ ఏ ఇద్దరు హీరోలతో లాంగ్ రైడ్ కి వెళతారు అని అడుగగా.. అయన ఎన్టీఆర్, చరణ్ లతో వెళతాను అన్నారు. వాళ్ళతో ట్రిప్ సరదాగా ఉంటుందన్న మహేష్ చిరంజీవి గారు కూడా ఉండాలి, మమ్ముల్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో మహేష్ కి ఎన్టీఆర్, చరణ్ లు మంచి మిత్రులని ఈ సంఘటనతో తెలిసిపోయింది. ప్రస్తుతం యూఎస్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ మే నెల నుండి వంశీ పైడిపల్లి మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

సంబంధిత సమాచారం :