పరశురామ్ కు మహేష్ డెడ్ లైన్ పెట్టారా?

పరశురామ్ కు మహేష్ డెడ్ లైన్ పెట్టారా?

Published on Sep 29, 2020 10:04 PM IST

mahesh parusuram
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇపుడు షూట్ కు రెడీ అవుతున్న తరుణంలో పలు ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. అలా ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి షూట్ మరియు మ్యూజిక్ పరంగా పలు అంశాలు బయటకొచ్చాయి.

అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం మహేష్ తన డైరెక్టర్ పరశురామ్ కు డెడ్ లైన్ పెట్టరాని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వేసవి రేస్ లో ఉంచేలా చూడాలని సూచించినట్టు వినికిడి. ఇప్పటికే నవంబర్ లో షూట్ మొదలైతే జనవరి కల్లా 40 శాతానికి పైగా షూట్ ను పూర్తి చేసేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ఇక అలా అన్నీ సెట్టయినట్టయితే కనుక ఈ చిత్రం వేసవి రేస్ లో ఉన్నా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇప్పటికే అన్ని అంశాల్లో పక్కాగా ఉన్న పరశురామ్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

తాజా వార్తలు