ఎంటర్టైనింగ్ మోడ్‌లోకి మహేష్ బాబు !

Published on May 11, 2019 3:50 am IST

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘మహర్షి’ చిత్రం నిన్ననే విడుదలైంది. వసూళ్లతో పాటు ప్రేక్షకుల స్పందన కూడా బాగుంది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన పూర్తి దృష్టిని తర్వాతి సినిమాపైకి షిఫ్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్నాడు. రావిపూడి చెప్పిన కథ పట్ల చాలా ఎగ్జైట్ అయ్యానని మహేష్ గతంలో పలుసార్లు చెప్పడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొని ఉంది.

అనిల్ తన గత సినిమాల్లో హీరోలను ఎలాగైతే పూర్తిగా ఎంటర్టైనింగ్ మోడ్‌లో చూపించాడో మహేష్ బాబుని కూడా అలానే చూపించనున్నాడట. కథ కూడా అన్ని కమర్షియల్ హంగులతో పాటు కామెడీని కలిగి ఉంటుందని, మహేష్ బాబుని ఇంతకుముందెన్నడూ చూడని కొత్త తరహాలో చూపించబోతున్నారని టాక్. జూన్ నెలలో లాంచ్ కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై నుండి మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More