మేకింగ్ వీడియోలో మహేష్ నవ్వులే హైలెట్

Published on Jan 9, 2020 9:00 pm IST

సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదలకు ఇంకా కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో చిత్ర ప్రమోషన్స్ పై మరింత శ్రద్ధ పెట్టారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా నేడు వైబ్ ఆఫ్ సరిలేరు నీకెవ్వరు పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణ సమయంలో చోటు చేసుకున్న కొన్ని ఆహ్లాదకర సంఘటనలతో కూడిన ఈ మేకింగ్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో మహేష్ నవ్వులే హైలెట్ గా నిలిచాయి. మహేష్ నవ్వుకి ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. ఆ నవ్వుతోనే ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. ఏమైనా ఈ మేకింగ్ వీడియో చిత్రానికి మంచి ప్రచారం కల్పిస్తుంది అనడంలో సందేహం లేదు.

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలకరోల్ చేశారు. భారీ అంచనాల మధ్య జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :