ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపిన మహేష్ బాబు

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా ఇంటర్వ్యూలలో, టీవిలలో కనిపివ్వడు అనేది తెలిసిందే. అలాగే తన ట్విట్టర్ లో కూడా కేవలం సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రంమే ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే తాజాగా విడుదల అయిన ‘ఆగడు’ టీసర్ కు వచ్చిన అనూహ్య స్పందనకు అయన ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా 14 రీల్స్ సంస్థ టీంకి మరియు దర్శకుడు శ్రీను వైట్లకు కూడా మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు.

సినిమా విడుదల దగ్గర అవడంతో మహేష్ ఇక ట్విట్టర్ లో ఆక్టివ్ గా కనిపించనున్నాడు. టీసర్ లానే సినిమా కూడా మంచి హిట్ సాధిస్తుందని ఆశిద్దాం.

Exit mobile version