‘మహర్షి’కి బూస్ట్ ఇచ్చే పనిలో మహేష్ !

Published on May 14, 2019 3:35 pm IST

సినిమాకు ప్రమోషన్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచింది. అవే సినిమాను ప్రేక్షకులకి దగ్గర చేస్తాయి. ఈ సక్సెస్ ఫార్ములాని ప్రజెంట్ జనరేషన్ హీరోలు బాగా నమ్ముతున్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. సినిమాకు ముందు సోషల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ద్వారా ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన ఇప్పుడు ముఖాముఖి వాళ్ళను కలవడానికి రెడీ అయ్యారు.

రేపు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ను మహేష్ సందర్శించనున్నారు. ఈ థియేటర్ విజిట్ సుదర్శన్‌కు మాత్రమే పరిమితమా లేకపోతే ఇంకొన్ని థియేటర్లలో కూడా ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీటితో పాటే ఇంకొన్ని ఈవెంట్లలో కూడా మహేష్ పాల్గొంటారట. వాటి వివరాలను చిత్ర బృందం త్వరలోనే తెలపనుంది. మొత్తానికి మహేష్ మంచి వసూళ్లను సాధిస్తున్న ‘మహర్షి’కి ఇంకొంత బూస్ట్ ఇవ్వనున్నారు.

సంబంధిత సమాచారం :

More