‘నందిని నర్సింగ్ హోమ్’ ఆడియో లాంచ్‌కు మహేష్!

mahesh-babu
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈనెల 27న నిర్వహించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానుండడం విశేషంగా చెప్పుకోవాలి. పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాధాకిషోర్, భిక్షం నిర్మించారు.

ఇక నిన్న ఉదయం సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నందిని నర్సింగ్ హోమ్ అన్న టైటిల్, ఇక్కడ అంతా క్షేమం అన్న ట్యాగ్‌లైన్ బాగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ హీరో సాయిధరమ్ తేజ్‌తో పాటు పలువురు ఇతర టాలీవుడ్ సెలెబ్రిటీలు నవీన్ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

nandini