తిరిగి షూట్లో జాయిన్ కానున్న మహేష్ బాబు !
Published on Oct 12, 2017 8:41 am IST

‘స్పైడర్’ సినిమా విడుదల తర్వాత మహేష్ బాబు కొరటాల శివతో చేస్తున్న ‘భరత్ అనే నేను’ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన గ్యాప్ తీసుకుని కుటుంబంతో కలిసి విదేశాలకు విహారానికి వెళ్లారు. సాధారణంగా హాలీడేస్ కు కొద్దిగా మాత్రమే సమయం తీసుకునే మహేష్ ఈసారెందుకో కొద్దిగా ఎక్కువ రోజులే కేటాయించుకున్నారు. దీంతో కొరటాల సినిమాకు అనుకున్నదానికంటే కొద్దిగా ఎక్కువ రోజులే బ్రేక్ పడింది.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ నెల 15 నుండి తిరిగి షూట్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ముగించి వేసవికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్న చిత్రాన్ని ప్రారంభిస్తారు.

 
Like us on Facebook