మహేష్ కి ఓ సర్జరీ..మళ్ళీ “సర్కారు” షూట్ అప్పుడే.!

Published on Dec 1, 2021 8:21 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆల్ మోస్ట్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిన ఈ చిత్రం షూట్ కి ఇంకొన్నాళ్ల పాటు బ్రేక్ రానున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం మహేష్ కి ఒక కీలక సర్జరీ జరగనుండడం అట.

అయితే అసలు విషయంలోకి వెళితే మహేష్ కి ఇది వరకే మోకాలికి సంబంధించి ఓ సమస్య ఉండగా దాని సర్జరీ కోసమే మహేష్ బ్రేక్ తీసుకోనున్నాడట. మరి ఆల్రెడీ సర్కారు వారి పాట షూట్ ఆల్ మోస్ట్ దగ్గరగా వచ్చేసింది, అందుకే మహేష్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారట.

అయితే ఈ సర్జరీ తర్వాత ఒక రెండు నెలల పాటు మహేష్ రెస్ట్ తీసుకోవాలని తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సర్కారు వారి పాట షూట్ లో పాల్గొని ఫినిష్ చేసేయనున్నారు. తర్వాత అనుకున్న సమయానికే ఏప్రిల్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :