వైరల్ : “అవతార్ 2” వీక్షించిన సూపర్ స్టార్.!

వైరల్ : “అవతార్ 2” వీక్షించిన సూపర్ స్టార్.!

Published on Dec 18, 2022 7:02 AM IST

ఇప్పుడు పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అవతార్ 2 కోసం అందరికీ తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా ఇది తెరకెక్కగా ఇప్పుడు ఇండియా లో కూడా ఈ చిత్రం సెన్సేషన్ ని రేపుతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ తెలుగు స్టేట్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం మరింత స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది.

ఇక ఇదిలా ఉండగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే సతీ సమేతంగా ఈ భారీ ట్రీట్ ని వీక్షించినట్టుగా తెలుస్తోంది. మరి హైదరాబాద్ లో తన ఏ ఎం బి మాల్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో తాను అలాగే తన భార్య నమ్రత లు అవతార్ ది వే ఆఫ్ వాటర్ ని వీక్షించినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ అయితే మరికొన్ని రోజుల్లో తన సినిమా షూట్ లో పాల్గొననున్నారు ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు