
విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్, హీబా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసి, సినిమా యూనిట్‌కి విషెస్ తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ సైతం ‘కుమారి 21 ఎఫ్’ సినిమా టీజర్‌ను ప్రశంసిస్తూ సినిమా యూనిట్‌కు తన విషెస్ తెలిపారు.
గత కొద్దిసేపటిక్రితం ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని మహేష్ ఈ విషెస్ తెలిపారు. “కుమారి 21 ఎఫ్ టీజర్ చాలా బాగుంది. రత్నవేలు సార్, దేవిశ్రీ ప్రసాద్‌ల వర్క్ అద్భుతంగా ఉంది. సుకుమార్ గారికి, మిగతా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఇక కూల్ టీజర్‌తో కట్టిపడేసిన సుకుమార్ అండ్ టీమ్‌కు ఎన్టీఆర్, మహేష్ లాంటి టాప్ స్టార్స్ సపోర్ట్ ఇవ్వడం విశేషంగా కనిపిస్తోంది. అక్టోబర్ 30వ తేదీన కుమారి 21 ఎఫ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

