మొదలైన మహేష్ మేనియా..,భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్.

మొదలైన మహేష్ మేనియా..,భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్.

Published on Nov 25, 2019 10:58 AM IST

mahesh babu

విడుదల నెల రోజులకు పైగా ఉండగానే మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు మేనియా మొదలైపోయింది. మూడురోజుల క్రితం విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ యూట్యూబ్ రికార్డుల వేట కొనసాగుతుంది. అనిల్ రావిపూడి మహేష్ ని ఈ చిత్రంలో ఎలా చూపించనున్నాడో శాంపిల్ చూపించాడు. ఇక వెండితెరపై మహేష్ డైలాగ్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు పేలడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర అభిమానులు భారీ కట్ అవుట్ ఏర్పాటు చేశారు. దాదాపు 80అడుగులకు పైగా ఉన్న ఈ కట్ అవుట్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఈవిషయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్నారు. రష్మిక మందనా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా లేడీ అమితాబ్ భారతి అనే పొలిటికల్ లీడర్ రోల్ చేస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా 2020 జనవరి 11న విడుదల కానుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు