ఫిబ్రవరి నుండి మొదలుకానున్న మహేష్ కొత్త సినిమా !
Published on Dec 3, 2017 9:52 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చేస్తున్న తెలిసిందే. ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తికానుంది. ఈ చిత్రం పూర్తవగానే మహేష్ 25వ చిత్రం ఫైబరువారి నుండి మొదలవుతుందని తెలుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్, సాంకేతిక నిపుణుల, నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 3 పాటల్ని కూడా ఫైనల్ చేశారు. ఎక్కువ భాగం యూఎస్ బ్యాక్ డ్రాప్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ యొక్క సిల్వర్ జూబ్లీ సినిమా కాడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.

 
Like us on Facebook