మహేష్ బాబు యూఎస్ ప్లాన్స్ ఇవేనట

Published on Sep 29, 2020 12:06 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొని ఉంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ ఈమధ్యకాలంలో చేస్తూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉండనుంది. ఇందులో మహేష్ యాటిట్యూడ్ సైతం వేరుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. ఈ షెడ్యూల్లోనే దాదాపు 40 శాతం వరకు సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది.

ఇందులో ఒక ఫైట్, రెండు పాటలను కూడ చిత్రీకరించనున్నారు. మహేష్ బాబుకు పలు హిట్ పాటలు రాసిన గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి పాటలు రాయనున్నారు. అక్టోబర్ ఆఖరి వారంలో టీమ్ మొత్తం అమెరికా బయలుదేరి వెళ్లనుండగా నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమవుతుందట. దాదాపు 45 రోజుల పాటి జరగనున్న ఈ షెడ్యూల్ జనవరి మధ్యలోకి ముగుస్తుంది. ఆతర్వాత రెండో షెడ్యూల్ హైదరాబాద్ నందు జరగనుంది.

ఇందులో తమిళ నటుడు అరవింద స్వామి ప్రతినాయకుడిగా నటిస్తారనే టాక్ ఉంది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More