‘భీమ్లా నాయక్’ నుంచి అసలు పండుగ ముందు ఉంది.!

Published on Sep 3, 2021 12:30 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భీమ్లా నాయక్ కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మాస్ లో మంచి అంచనాలతో ఉంది. మరి అంతే హైప్ లో నిన్ననే ఈ చిత్రం నుంచి శాలి ఫస్ట్ సింగల్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇది స్పీడ్ గా మంచి మాసివ్ గా ఉంటుంది అనుకున్నారు కానీ అసలు మేకర్స్ ప్లాన్ చేసిందే వేరు..

స్లోగా ఉన్న థమన్ సరికొత్త బీట్స్ మరియు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కి సాలిడ్ రెస్పాన్స్ ఆల్ టైం రికార్డు వ్యూస్ అండ్ లైక్స్ రూపంలో ఆడియెన్స్ అందించారు. అయితే ఇది మాత్రం అసలు బిగినింగ్ అని థమన్ అంటున్నాడు. ఇది ఫస్ట్ బుల్లెట్ మాత్రమే అని లేటెస్ట్ పోస్ట్ చేసాడు. మరి దీనిని బట్టి ఇక ముందు పాటలు ఏ లెక్కలో ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంకా గ్లింప్స్ లో విన్న పాట అలాగే పవన్ తో పాడించిన పాట చాలానే ఉన్నాయి. మరి అవన్నీ ఈత హై ని ఇస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :