నాగ చైతన్య ‘మాయ’ చేస్తున్నాడు !

నాగ చైతన్య ‘మాయ’ చేస్తున్నాడు !

Published on Mar 26, 2019 2:52 PM IST

సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్ తో పాటు మూడు సింగల్స్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలోని ‘మాయా మాయా’ అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ సినిమాలోని చైతు క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. అలాగే సాంగ్ పిక్చరైజెషన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లను ఈ పాట బాగానే అలరిస్తోంది. ప్రస్తుతానికైతే సినిమా పై మంచి పాజిటివ్ వైబ్ ఉంది.

ఇక ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. సమంత, నాగ చైతన్యలు సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పెళ్లి తరువాత సమంత, నాగ చైతన్య మొదటిసారి కలిసి నటిస్తోన్నారు. మరి మజిలీ వాళ్ళకి ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు