మజిలీ ఫస్ట్ లుక్ విడుదల !

Published on Dec 30, 2018 10:11 am IST

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న కొత్త చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను అధికారికంగా కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక పోస్టర్ లోని చైతు , సమంత లుక్ ఆకట్టుకొనేలా ఉంది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది. దివ్యంకా కౌశిక్ , పోసాని కృష్ణ మురళి , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక వివాహం అనంతరం చైతన్య , సమంత కలిసి నటిస్తున్న ఈచిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :