స్పెషల్ డే నాడు మజిలీ టీజర్ !

Published on Feb 12, 2019 3:41 pm IST

నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న ‘మజిలీ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది . ఇక ఈచిత్రం యొక్క టీజర్ ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నారు. ఫస్ట్ టైం ఈచిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ నటిస్తుండగా బాలీవుడ్ నటి దివ్యంక కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.

గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :