ఆ ఛాన్స్ అనసూయకే దక్కనుందా ?

Published on Feb 25, 2020 8:00 am IST

హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’ రీమేక్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవలే చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రం హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో కథ, కథనం, నటుడు ఆయుష్మాన్ ఖురాన్ నటనతో పాటుగా నెగెటివ్ రోల్ చేసిన టబు పెర్ఫార్మెన్స్ కూడా ఉంది.

ఈ బోల్డ్ క్యారెక్టర్లో టబు నటన సినిమాకే హైలెట్ అయింది. ఇక తెలుగు రీమేక్లో ఈ పాత్రను ఎవరు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మొదట టబుయే నటిస్తుందనే వార్తలు వచ్చినా ఇప్పుడు యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ పేరు తెరపైకొచ్చింది. టబు ఎలాగూ భారీ పారితోషకం డిమాండ్ చేస్తుంది కాబట్టి అనసూయను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట నిర్మాతలు. ఈ వార్తలే నిజమై అనసూయ నటించడానికి ఒప్పుకుంటే నటిగా ఆమె కెరీర్లో మంచి చిత్రం పడ్డట్టే.

సంబంధిత సమాచారం :

X
More