మెగా 158 : ఆ విషయాన్ని రివీల్ చేసేందుకు సిద్ధమవుతున్న మేకర్స్..?

మెగా 158 : ఆ విషయాన్ని రివీల్ చేసేందుకు సిద్ధమవుతున్న మేకర్స్..?

Published on Jun 18, 2026 3:58 PM IST

Mega 158

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో తన ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ కీలక షెడ్యూల్ కోసం చిత్రబృందం ఒక భారీ సెట్‌ను నిర్మించింది. చిరంజీవి తాజాగా ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టనుండగా, ఈ షెడ్యూల్‌లో కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ముఖ్యమైన టాకీ భాగాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు, విపరీతమైన బజ్ నెలకొన్నాయి.

ఈ సినిమా షెడ్యూల్స్ అన్నీ పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించబోయే హీరోయిన్ వివరాలను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ, ఈ షెడ్యూల్ ముగిసేలోపే అధికారికంగా ప్రకటించేందుకు ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేస్తోందట. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర పడనుంది.

థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, అనస్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు