హైద్రాబాద్‌లో మళయాల స్టార్ సందడి!
Published on Aug 24, 2016 12:53 pm IST

Dulquer-salman
మళయాల సినీ పరిశ్రమలో స్టార్ హీరో అయిన దుల్కర్‌ సల్మాన్‌కు యూత్‌లో ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరైన ఈ స్టార్, తాజాగా ‘100 డేస్ ఆఫ్ లవ్’ అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మళయాలంలో గతేడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఆగష్టు 26న ఈ సినిమా తెలుగులో విడుదలవుతోన్న సందర్భంగా టీమ్ హైద్రాబాద్‌లో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమం కోసమే దుల్కర్ ప్రత్యేకంగా హైద్రాబాద్ వచ్చారు. తెలుగు ప్రేక్షకులు తనని మొదట్నుంచీ బాగా ఆదరిస్తూ వస్తున్నారని, స్ట్రైట్ మళయాల సినిమాలు కూడా హైద్రాబాద్‌లో ఆడడం చాలాసార్లు చూశానని అన్నారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఎప్పటికీ ఋణపడి ఉంటానని దుల్కర్ ఈ సందర్భంగా తెలిపారు. ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమా విషయానికి వస్తే, జీనస్ మహమ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దుల్కర్, నిత్యా మీనన్‌ల జోడీ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని టీమ్ తెలిపింది.

 
Like us on Facebook