జనవరి 30న ‘మళ్లి మళ్లీ ఇది రాని రోజు’..!

జనవరి 30న ‘మళ్లి మళ్లీ ఇది రాని రోజు’..!

Published on Jan 20, 2015 7:09 PM IST

Malli-malli
శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా ‘ఓనమాలు’ ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘మళ్లి మళ్లీ ఇది రాని రోజు’. వీరిద్దరి జంటకు మంచి పేరొచ్చింది. ట్రైలర్, సాంగ్ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆడియో శ్రోతలకు చేరువైంది. ప్రేమకు కులం, మతం అడ్డుకావనే కాన్సెప్ట్ తో వెండితెర దృశ్యకావ్యంలా మలిచిన ఈ సినిమాను జనవరి 30న విడుదల చేయనున్నారు.

శర్వానంద్ ఈ సినిమాలో స్పోర్ట్స్ మెన్ గా కనిపించనున్నారు. తేజస్వి, నాజర్, తనికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ప్రేమకథా చిత్రానికి సాయి మాధవ్ బుర్రా రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర సమర్పకులు ప్రధాన కెఎస్ రామారావు తెలిపారు. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై కె.ఏ.వల్లభ ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు