‘ధృవ 2’లో విలన్ గా స్టార్ హీరో ?
Published on Sep 10, 2018 9:30 pm IST


జయం రవి, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం’తని ఒరువన్’. జయం రవి అన్న మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ హీరో అరవింద స్వామి ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించాడు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆయన చాలా రోజుల తరువాత అక్కడ ఈచిత్రంతో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాను తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈచిత్రంలో కూడా అరవింద స్వామే ప్రతినాయకుడిగా నటించారు. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఇక ఇప్పుడు మళ్ళీ జయం రవి , మోహన్ రాజా కాంబినేషన్ లో ‘తని ఒరువన్ 2’ తెరకెక్కనుంది. ఈచిత్రంలో కాజల్, సాయేషా కథానాయికలుగా నటించనున్నారు. మొదటి పార్ట్ లోలాగే ఈచిత్రంలో విలన్ పాత్ర సినిమాకి హైలైట్ కానుందట. ఈ ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారట. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇక మమ్ముట్టి ప్రస్తుతం తెలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ అనే చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు.

  • 10
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook