అఖిల్ ‘ఏజెంట్’లో మ‌మ్ముట్టి పాత్ర ఇదేనా?

Published on Jul 7, 2021 2:22 am IST

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ ఓ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఈ సినిమాలో సీనియర్ హీరో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆయ‌న‌ దాదాపు రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర ఏమై ఉంటుంది, అసలు ఆయననే ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. అఖిల్, మమ్ముట్టి తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నార‌ని కొందరంటుంటే, గురు శిష్యులుగా క‌నిపించ‌బోతున్నారని మరికొందరు అంటున్నారు. ఇంకొందరేమో విలన్‌గా కనిపిస్తాడని అంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య సంబంధం ఏదైనా ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉంటుందని అందుకనే అంత మొత్తంలో ఆయనకు పారితోషికం ఇచ్చి మరీ ఒకే చేయించుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతోంది.

సంబంధిత సమాచారం :