నవంబర్ 14న వస్తున్న “మన కుర్రాళ్ళే”

నవంబర్ 14న వస్తున్న “మన కుర్రాళ్ళే”

Published on Oct 25, 2014 9:00 PM IST

Mana-Kurralle

“ఈ సమాజంలో యువతీ యువకులు ఎంత ఉల్లాసంగా జీవితాన్ని ఆనందిస్తారో , ఒక లక్ష్యం ఏర్పడితే అంతే దీక్షతో దాన్ని సాధిస్తారు. వాళ్ళ సరదాలు, సంతోషాలు.. బంధాలు,భావోద్వేగాలకు ప్రతిరూపం మా ‘మన కుర్రాళ్ళే’ చిత్రం. యూత్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలు పుష్కలంగా వున్న ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నాం”అని ప్రకటించారు దర్శక నిర్మాత వీరశంకర్. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం యువతని ఉత్తేజితం చేస్తుందని, ఆయన పేర్కొన్నారు. 2007లో సాఫ్ట్ వేర్, రియల్, షేర్ బూమ్‌లు బుసలు కొడుతూ పైకెగిసిన కాలంలో ఈ కథ ప్రారంభమై 2014లో ముగుస్తుంది. గ్రామం నుంచి వచ్చి హైదరాబాదులో ఉంటున్న కొందరు యువతీ యువకులను ఆ కాలం ఎలా ప్రభావితం చేసింది, మన మూలాలను కాపాడుకోవాడానికి వాళ్ళంతా వ్యూహాత్మకమైన యుద్ధాన్ని చేసి విజయాన్ని ఎలా సాధించారు..అన్నది ఇతివృత్తమని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రంలోని పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆస్రా నిర్మాణ్ ఇండియా సమర్పణలో,వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్, రావు రమేష్, కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి,కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, బెంగుళూరు పద్మ, వెంకట్, వేణు మాధవ్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం కాగా, చాయాగ్రహణం:ముజీర్ మాలిక్, సంగీతం:రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె, శివకాకాని, మోహన్‌జోనా, భీమ్స్ కూర్పు:బస్వా పైడిరెడ్డి, కళ:కె.వి.రమణ,నిర్వహణ:మహేష్ వడ్డి,రాంబాబు కుంపట్ల, సహనిర్మాతలు:గంగ పోలిశెట్టి, సత్యవతి బొరుసు నిర్మాతలు:బి.వి.యస్.శ్రీనివాసు,ఎచ్.ఎస్.అరూన్ కథ,కథనం,మాటలు,దర్శకత్వం:వీరశంకర్.

తాజా వార్తలు