మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) కోసం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చి రికార్డు గ్రాసర్ గా దుమ్ము లేపింది. అయితే ఈ కొన్ని రోజుల్లోనే మన శంకర వరప్రసాద్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రిజిస్టర్ చేసింది. మెయిన్ గా సింగిల్ స్క్రీన్స్ లో 1 కోటికి పైగా గ్రాస్ ని క్రాస్ చేసినవి చాలానే ఉన్నాయట.
ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 20కి పైగానే సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ లలో ఈ సినిమా కోటికి పైగా గ్రాస్ ని రాబట్టి దూసుకెళ్తుంది. ఇక దీనితో పాటుగా 25 కి పైగా టౌన్స్ లో 1 కోటికి పైగా గ్రాస్ ని ఈ సినిమా అందుకుందని పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వారాంతంలో కూడా పెద్దగా సినిమాలు లేవు కాబట్టి మళ్ళీ ఈ సినిమానే టేకప్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కీలక రోల్ లో నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.
