మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) జనవరి 12న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు జనవరి 11న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్ షోలు వేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు అందుబాటులోకి రానుండగా, అనంతరం ఇతర ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్స్‌లో కూడా ఓపెన్ అవుతాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతులు జారీ చేయగా, తెలంగాణలో మాత్రం ప్రీమియర్ షోలకే హైక్స్ వర్తించే అవకాశం ఉందని సమాచారం. నైజాం ఏరియాలో బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యాథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటించారు.


