మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu). ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది, చిరంజీవి స్టార్ డమ్ కూడా ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిగమించి, ఆల్-టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఐతే, ఇప్పుడు మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో అత్యధికంగా 7వ రోజు వసూళ్లు సాధించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని అధిగమించి మరో ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది ఈ చిత్రం.
సాధారణంగా, సంక్రాంతి సీజన్ చివరి రోజున ప్రజలు తిరిగి ప్రయాణాలు ఉంటాయి కాబట్టి, వసూళ్లలో బాగా తగ్గుదల కనిపిస్తుంది. అయితే, ఈ సినిమాకి మాత్రం భారీగా కలెక్షన్స్ రావడం విశేషం. ఎలాగూ ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్స్ ను కూడా బలంగా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ సినిమాకు మరింత ప్రచారం కల్పించనున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.



