బిట్స్ పిలానీలో సందడి చేస్తున్న నాగ చైతన్య

Published on Sep 1, 2013 2:10 am IST

naga-chayatana-latest-still

డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తరువాతి తరం హీరో అక్కినేని నాగార్జున, ఆయన తరువాతి తరం హీరో అయిన నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘మనం’. తెలుగు సినీ చరిత్రలోనే ఇలా మొట్టమొదటిసారిగా ఒక కుటుంబంలోంచి మూడు తరాల నటులు కలిపి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ బిట్స్ పిలానీ కాలేజీలో జరుగుతుంది. ఈరోజు నాగ చైతన్య, ఎం.ఎస్ నారాయణల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటికే బిట్స్ పిలానీ లో ‘100% లవ్’, వెంకటేష్ ‘బాడీగార్డ్’ వంటి సినిమాలను తీసారు.

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ ముగించుకున్న సమంత ‘మనం’ సినిమా షూటింగ్ లో రేపు పాల్గోనుంది. ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో జంటగా ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :