మంచు హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్ గత కొన్నాళ్ళుగా కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. విష్ణు ఎక్కువ గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నా ఆయన్ను విజయం పలకరించి చాన్నాళ్లు అయింది. ఆయన చివరి చిత్రాలు ‘ఆచారి అమెరికా యాత్ర, ఓటర్’ రెండూ బోల్తా కొట్టాయి. ఇక మంచు మనోజ్ అయితే 2017లో ‘ఒక్కడు మిగిలాడు’తో పలకరించి ఆ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు.
ఈ వరుస పరాజయాల పరంపర నుండి బయటపడేందుకు ఈ ఇద్దరూ కొత్తగా ప్రేక్షకుల ముందుకురానున్నారు. మూడు రోజుల క్రితం విష్ణు తన కొత్త ద్విభాషా చిత్రం ‘మోసగాళ్ళు’ను అనౌన్స్ చేశారు. 2020 వేసవికి ఈ చిత్రం విడుదలకానుంది. ఇక వ్యక్తిగత సమస్యల నుండి రిలీఫ్ పొందిన మనోజ్ కూడా కొత్త కథ చిత్రీకరణకు రెడీగా ఉందని, త్వరలో కలుద్దాం..కుమ్మేద్దాం అంటూ సినిమాను ఖాయం చేశారు. మొత్తానికి మంచు కాపౌండ్లో పాత సందడి మళ్లీ కనిపించనుంది.


