“ఆహా” లో రకుల్ ప్రీత్ మంచు లక్ష్మి ల సందడి!

Published on Jul 27, 2021 7:30 pm IST

ఆహా వీడియో చేస్తున్న సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ఆహా భోజనంబు ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర ప్రయత్నం చేస్తుంది ఆహా వీడియో. అయితే ఇప్పటికే మంచు లక్ష్మీ తో విశ్వక్ సేన్ చేసిన ప్రోగ్రాం హిట్ కాగా, తాజాగా మంచు లక్ష్మీ ఈసారి తన బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ తో మన ముందుకు వస్తున్నారు.

అయితే మంచి భోజనం కంటే ఎక్కువ ఏం ఉంటుంది అంటూ ఆహా చెప్పుకొచ్చింది. అదే విధంగా మంచి స్నేహితుడి తో మంచి భోజనం అంటూ ఆహా వీడియో సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మరియు మంచు లక్ష్మి చేసిన హంగామా త్వరలో ఆహా భోజనంబు ద్వారా మీ ముందుకు వస్తుంది అంటూ తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :