మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ రిలీజ్ డేట్

మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ రిలీజ్ డేట్

Published on Sep 9, 2014 1:54 PM IST

Current-Teega
యంగ్ అండ్ ఎనర్జిటిక్ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కరెంట్ తీగ’. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచు మనోజ్ ఈ సినిమాలో పాడిన దేవదాసు అనే ఫుల్ బ్రేకప్ సాంగ్ ని ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాని మంచు విష్ణు24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ‘ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. మంచు మనోజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సినిమా కరెంట్ తీగ అని’ మంచు విష్ణు అన్నాడు.

మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది.

తాజా వార్తలు