విడాకులు తీసుకోవట్లేదు.. తర్వాత ప్రేమ కథే – మనోజ్
Published on Jun 8, 2018 4:41 pm IST


గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరో మంచు మనోజ్, అతని భార్య ప్రణతి విడాకులు తీసుకోనున్నట్లు రకరకాల వార్తలొచ్చాయి. వీటిని గమనించిన మనోజ్ ట్విట్టర్లో భార్యతో కలిసి డిన్నర్ చేస్తున్న పిక్ పెట్టి విడాకుల వార్త అవాస్తవమని హింట్ ఇచ్చినా ఆ గాసిప్స్ ఆగలేదు. దీంతో కొద్దిసేపటి ట్విట్టర్ ద్వారా అభిమానులతో మాట్లాడిన ఆయన ఈ వార్తలు అబద్దమని మరోసారి ఖండించారు.

అలాగే సినిమా గురించిన ప్రస్తావన రాగానే తన తర్వాతి చిత్రం ప్రేమ కథగా ఉండబోతోందని కూడ అన్నారు. అయితే ఆ సినిమా దర్శకుడెవరు, ఇతర నటీనటులెవరే, చిత్రం ఎప్పుడు ఉంటుంది వంటి విషయాల గురించిన సమాచారం తెలియాల్సి ఉంది. మనోజ్ గత చిత్రాలు ‘గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు’ వంటివి పెద్దగా విజయం సాధించకపోవడంతో అభిమానులు ఆయన తర్వాతి చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook