మంచు మనోజ్ చెప్పబోయేది సినిమా గురించేనా

Published on Jan 29, 2020 12:01 am IST

హీరో మంచు నుండి సినిమా వచ్చి చాలా రోజులే అయింది. అయన చివరగా 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంలో కనిపించారు. మధ్యలో వ్యక్తిగత సమస్యల కారణంగా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. త్వరగా సినిమా చేయమని నిత్యం సోషల్ మీడియాలో ఆయన్ను కోరుతూ వచ్చారు.

ప్రస్తుతం సమస్యలన్నీ ఒక కొలిక్కి రావడంతో ఆయన సినిమాకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ట్విట్టర్ ద్వారా ఇంటరాక్ట్ అయిన ఆయన ఇప్పుడు సిద్దంగా ఉన్నానన్న ఆయన త్వరలోనే ఆసక్తికరమైన విషయాన్ని చెబుతానని, సిద్దంగా ఉండమని అన్నారు. ఈ మాటల్ని బట్టి ఆయన చేయబోయే ప్రకటన కొత్త సినిమా గురించే అయ్యుంటుందని అభిమానులు ఆభిప్రాయపడుతున్నారు. మరి మనోజ్ సినిమా గురించే చెబుతారా లేకపోతే వేరే ఏదైనా విషయం చెబుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More