“గాలి నాగేశ్వరావు”గా రాబోతున్న మంచు విష్ణు..!

Published on Mar 5, 2022 1:00 am IST


హీరో విష్ణు మంచు ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫేమ్ ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసి అభిమానులకు, ప్రేక్షకులకు విభిన్నమైన రీతిలో ఈ చిత్రాన్ని పరిచయం చేశాడు. అయితే తాజాగా ఈ సినిమాలోని తన చమత్కారమైన పాత్ర పేరు “గాలి నాగేశ్వరావు” అని విష్ణు తెలిపాడు.

మోహన్ బాబు గారి ఆశీస్సులతో ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ మరియు స్క్రీన్ ప్లే రైటర్‌గా పని చేసారు. అనూప్ రూబెన్స్‌ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇక కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలతో సినిమాను ప్రమోట్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా మరిన్ని అప్డేట్స్ వస్తాయని తెలిపాడు.

సంబంధిత సమాచారం :