శ్వేతబసు ప్రసాద్ కి ఆఫర్ ఇస్తానన్న మంచు విష్ణు

manchu-vishnu-sweth-basu
గత కొద్ది రోజులుగా హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ వ్యభిచారం టాపిక్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో కొంతమంది ప్రముఖులు ఆమెని సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కూడా ఈ విషయ్యంపై స్పందించాడు.

‘ ఈ కేసులో శ్వేతబసుతో పాటు దొరికిన బడాబాబుల పేర్లను మాత్రం పోలీసులు, మీడియా వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు. సినిమా సెలబ్రిటీ అవ్వడం ఆ అమ్మాయి చేసుకున్న పాపమా.? మీడియా, పోలీసులు కూడా ఈ విషయంలో ఎక్కువ అత్యుత్సాహం చూపారు. ప్రతిచోటా తప్పులు జరుగుతాయి. అలా అని ఇలా చూపించడం సబబు కాదు. 11ఏళ్ళ వయసులో జాతీయ అవార్డు అందుకున్న మంచి నటి తను. శ్వేతబసు ప్రసాద్ కి నా తదుపరి సినిమాలో మంచి రోల్ ఇస్తానని’ మంచు విష్ణు అన్నాడు.

మంచు విష్ణు హీరోగా నటించిన ‘అనుక్షణం’ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ స్టైల్లో ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.

Exit mobile version