“ఢీ 2” కు అదిరిపోయే మేకోవర్ లో మంచు విష్ణు.!

Published on Jan 27, 2021 7:00 pm IST

మన టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ కామెడీ సినిమాలు తీసుకున్నట్టయతే వాటిలో శ్రీను వైట్ల మరియు మంచు విష్ణు కాంబోలో వచ్చిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ఢీ” ఖచ్చితంగా ఉంటుంది. దానితో అక్కడ నుంచి ఈ కాంబో అంటే మంచి బెంచ్ మార్క్ సెట్టయ్యింది. మరి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఈ కాంబోలో అదే ఢీ టైటిల్ తో “ఢీ 2″(డబుల్ డోస్) గా మరో సినిమాను అనౌన్స్ చెయ్యడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాకపోతే దీనిని దానికి సీక్వెల్ గా తెరకెక్కించడం లేదు కానీ కొత్త కథ అని ప్రకటించారు. మరి ఈ సినిమాకు గాను మంచు విష్ణు మైండ్ బ్లోయింగ్ మేకోవర్ ను రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం తాను ప్రిపేర్ చేస్తున్న లుక్ తాలూకా జిమ్ వీడియోనే సోషల్ మెయిదాలో బయటకు వచ్చింది. మరి ఈ సినిమా కోసం విష్ణు అయితే గట్టిగానే కష్టపడుతున్నాడు. మరి ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :