మా ఎలక్షన్: మంచు విష్ణు ప్యానెల్‌పై సర్వత్రా ఉత్కంఠ..!

Published on Sep 22, 2021 10:15 pm IST


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు కూడా తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించేందుకు రెడీ అయినట్టు సమాచారం.

అయితే సెప్టెంబర్ 23 అనగా రేపు విష్ణు తన ప్యానెల్‌ను ప్రకటించబోతున్నారట. కాగా మంచు విష్ణు ప్యానెల్‌లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో బాబు మోహన్, రఘుబాబు పేర్లు ఉన్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘుబాబు ఉండనున్నారని సమాచారం. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి ధీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉంటుందని చిత్ర పరిశ్రమతో పాటు, సినీ అభిమానుల్లో కూడా దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీ పదవికి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా బరిలో నిలవబోతున్నాడు.

సంబంధిత సమాచారం :