మరోసారి తండ్రి కాబోతున్న ‘హీరో’ !

Published on May 2, 2019 1:00 pm IST

‘రేపు ఎనౌన్స్ మెంట్ తో నా లైఫ్ చేంజ్ అవ్వబోతుందని’ మంచు విష్ణు నిన్న చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేసింది. విష్ణు ఈ ట్వీట్ ఎందుకు పోస్ట్ చేసారా.. ? ఈ ట్వీట్ కి అర్ధం ఏంటా అని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కొంతమంది అయితే మంచు విష్ణు ఇక సినిమాలు చేయనని ప్రకటిస్తారేమోనని కూడా అనుకున్నారు. మొత్తానికి మంచు విష్ణు తాజాగా చేసిన ట్వీట్ తో ఆ విషయం గురించి క్లారిటీ వచ్చేసింది.

విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నారు. మంచు విష్ణు సతీమణి విరోనికా త్వరలో ఇంకో బిడ్డకు జన్మనివ్వనుంది. కొద్దిసేపటి క్రితమే విష్ణు ‘తమ కుటుంబంలోకి మరొక ఏంజెల్ రాబోతోందని’ ట్విట్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇక విష్ణు.. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో వైసిపి తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More