“మా” ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న మంచు విష్ణు!

Published on Oct 13, 2021 1:00 pm IST

తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన “మా” ఎన్నికల్లో ఊహించని విధంగా మంచు విష్ణు గెలుపొందారు. అత్యధిక వోటింగ్ తో నమోదు అయ్యిన ఈ ఎన్నికలు అనేక రసవత్తర పరిస్థితులు నడుమ ఈ ఎన్నికల అధ్యాయం పూర్తయ్యింది. అయితే ఈ ఎలాగో ఫైనల్ గా “మా” అధ్యక్షునిగా మంచు విష్ణు గెలుపొందాడు. మరి ఈరోజు మంచు మనోజ్ ఎట్టకేలకి మా ప్రెసిడెంట్ గా ఈరోజు ఛార్జ్ తీసుకున్నాడు.

చిన్న సన్మానం అనంతరం అధ్యక్షనిగా సంతకం చేసి మంచు విష్ణు ఈరోజు నుంచి భాద్యతలు చేపట్టాడు. ఇప్పుడు ఈ ఫోటోలు బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి. ఇక ముందు నుంచి ‘మా’ లో విష్ణు ఎలాంటి మార్పులు తీసుకొస్తాడో అన్నది చూడాలి. అలాగే మరోపక్క విష్ణు తన హిట్ దర్శకుడు శ్రీను వైట్లతో “ఢీ డబుల్ డోస్” సినిమాలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :