మంచు విష్ణుతో ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ రొమాన్స్..?

మంచు విష్ణుతో ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ రొమాన్స్..?

Published on Nov 3, 2014 1:43 PM IST

vishnu-aadashrma
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్వీట్ పెయిన్ కలిగించిన హీరోయిన్ అదా శర్మ. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు మంచు విష్ణుతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది. దేవా కట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘అరిమ నంబి’ రీమేక్ లో హీరోయిన్ గా అదా శర్మ పేరును పరిశీలిస్తున్నారు. దాదాపు ఖాయమేనని వార్తలు వస్తున్నాయి. అధికారికంగా దర్శకనిర్మాతలు నుండి ఎటువంటి ప్రకటన రాలేదు.

మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుంది.

తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ చేతిలో ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో పాటు ఆది ‘గరం’లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు